సిరీస్‌పై కన్నేసిన కోహ్లీసేన.. గెలవాలన్న పట్టుదలతో విండీస్‌

సిరీస్‌పై కన్నేసిన కోహ్లీసేన.. గెలవాలన్న పట్టుదలతో విండీస్‌

ind-vs-wi

తిరువనంతపురం వేదికగా ఆదివారం టీమిండియా-వెస్టిండీస్‌ మధ్య రెండో టీ20 జరగనుంది. తొలి టీ20లో దుమ్మురేపిన కోహ్లీసేన.. రెండో వన్డేను కూడా గెలిచి సీరిస్‌ కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సరీస్‌ గెలుచుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. తొలి టీ20లో పరాజయం పాలైన విండీస్‌.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సీరిస్‌ సమయం చేయాలని భావిస్తోంది. ఇందు కోసం వ్యూహాలకు పదును పెడుతోంది. సిరీస్‌లో నిలవాలంటే కచ్చితంగా వెస్టిండీస్‌ రెండో టీ20 గెలవాల్సిన పరిస్థితి.

టీ20 ఫార్మాట్‌లో ప్రపంచ చాంపియన్‌ అయినప్పటికీ భారత్‌ ముందు వెస్టిండీస్‌ ఆటలు సాగడం లేదు. టీ20 మ్యాచ్‌ల్లో చెలరేగిపోయే కరీబియన్లు..భారత్‌ ముందు మాత్రం తేలిపోతున్నారు. గత 13 నెలల్లో విండీస్‌పై భారత్‌ సాధించిన విజయాలే దీన్ని రుజువు చేస్తున్నాయి. నవంబర్‌ 2018 నుంచి ఇప్పటి వరకు భారత్‌ వరుసగా 7 మ్యాచ్‌ల్లో విండీస్‌పై నెగ్గింది.

తొలిమ్యాచ్‌లో భారత బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. వికెట్లు తీయకపోగా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. స్పిన్నర్లు జడేజా, చహల్‌ రాణించినా... ఫీల్డింగ్‌లోనూ భారత్‌ తడబడింది. కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్‌తోనే తొలి టీ20 గట్టెక్కామన్నది నిజం. మన బౌలింగ్‌, ఫీల్డింగ్‌ మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉంది. మొత్తంగా ఆదివారం ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ రసవత్తరంగా జరగనుంది. కోహ్లి సేన రెండో టీ20లోనూ నెగ్గి సిరీస్‌ను సొంతం చేసుకుంటుందా? విండీస్‌ సిరీస్‌ను సమం చేస్తుందా అనేది వేచి చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story