వైఎస్‌ వివేకా హత్యపై సీఎం జగన్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లేఖ

వైఎస్‌ వివేకా హత్యపై సీఎం జగన్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లేఖ
X

ys-viveka

వైఎస్‌ వివేకా హత్యపై.. సీఎం జగన్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. వైఎస్‌ వివేకా హత్య కేసు నిందితుల్ని అరెస్టు చేయకపోవడాన్ని ఆయన లేఖ ద్వారా ప్రశ్నించారు. మార్చిలో వివేకా హత్య జరిగితే.. ఇప్పటి వరకు నిందితులను పట్టుకోలేకపోవమేంటన్నారు కన్నా. వివేకా హత్య కేసు దర్యాప్తును తక్షణం CBIకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. మాజీ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి సోదరుడి హత్యకేసు దర్యాప్తు అతిగతీ లేకుండా పోయిందని విమర్శించారు.

Tags

Next Story