పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ.. యువతి ధర్నా

పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ.. యువతి ధర్నా
X

ctr

పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి ధర్నాకు దిగింది. చిత్తూరు జిల్లా పీలేరు మండలం రేగళ్లు గ్రామానికి చెందిన మణికంఠ.. తిరుపతి కొర్లగుంటలో ఉంటున్న యువతిని నాలుగు నెలల క్రితం పెళ్లిచూపులలో కలిశాడు. తన తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా.. నిన్నే పెళ్లిచేసుకుంటానని మాట ఇచ్చాడు. తనని బెంగళూరుకు సైతం తీసుకెళ్లాడని యువతి అంటోంది. అయితే.. ఎక్కువ కట్నం వస్తోందనే ఆశతో ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధమయ్యాడని.. తనను నిరాకరిస్తున్నాడంటూ అమ్మాయి ఆరోపించింది. యువకుడి ఇంటి ముందు ధర్నాకు కూర్చుంది. ట్రాఫిక్‌ స్తంభించిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

Tags

Next Story