పౌరసత్వ చట్ట సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన అమిత్‌షా

పౌరసత్వ చట్ట సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు హోంమంత్రి అమిత్‌షా. బిల్లును ఆమోదిస్తే ప్రధానంగా మూడు దేశాల్లోని పాకిస్థాన్..బంగ్లాదేశ్..అఫ్ఘానిస్థాన్‌లో వివక్షకు గురై.. అక్కడి నుండి మన దేశానికి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు భారత పౌరసత్వం లభిస్తుంది. ఈ మూడు దేశాల నుంచి 2014 డిసెంబరు 31వ తేదీలోపు వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులను అక్రమ వలసదారులుగా పరిగణించరు. బిల్లుపై చర్చను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ రోజునే చర్చను ముగించి ఓటింగ్ సైతం పూర్తి చేసేలా వ్యూహం సిద్దం చేసింది. ఇప్పటికే సభ్యులంతా సభకు తప్పని సరిగా హాజరవ్వాలంటూ బీజేపీ.. తమ సభ్యులకు విప్ జారీ చేసింది. అటు...ఈ పౌరసత్వ బిల్లుపై కాంగ్రెస్‌తో పాటు 11 పార్టీలు వ్యతిరేకించాయి. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందన్నారు కాంగ్రెస్ నేత ఆదిర్ రంజన్ భట్టాచార్య. ఇది పూర్తి చట్టవిరుద్దమైన బిల్లు అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com