ఎల్లాపటార్ హత్య బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన భట్టి విక్రమార్క

కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా లింగాపూర్‌ మండలంలో అత్యాచారానికి గురైన దళిత మహిళ కుటుంబాన్ని పరామర్శించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఎల్లాపటార్‌ గ్రామ శివారులో గత నెల ఆమెపై అత్యాచారం, హత్య జరిగిన ఘటన స్థలాన్ని ఆయన సందర్శించారు. రాష్ట్రంలో మారుమూల గిరిజన ప్రాంతంలో ఈ ఘటన జరగడం చాలా ఘోరమైందని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందన్నారు. ముగ్గురు నిందితులను కఠినంగా శిక్షించి.. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యాచార ఘటనలను అరికట్టడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. మరోవైపు ఎల్లపటార్‌ అత్యాచారం, హత్య బాధితురాలి పేరును సమతగా మార్చినట్టు జిల్లా ఎస్పీ మల్లా రెడ్డి ప్రకటించారు.

Tags

Read MoreRead Less
Next Story