ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
అతివేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం నలుగురు ప్రాణాలను బలి తీసుకుంది. కారు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో.. స్పాట్‌లోనే నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో చోటు చేసుకుంది.
హైద్రబాద్ నుంచి నిజామాబాద్‌కు వెళ్తుండగా కారు ప్రమాదానికి గురి అయ్యింది. అతివేగంగా వెళ్తున్న కారు.. మొదట డివైడర్‌ను ఢీకొన్ని పక్కనే ఉన్న మర్రి చెట్టును ఢీకొట్టింది. చెట్టును బలంగా ఢీకొనడంతో కారు నుజ్జు నుజ్జు కావడంతో అక్కడికక్కడే నలుగురు చనిపోయారు. మృతదేహాలు కారులో ఇరుక్కుపోవడంతో.. స్థానికులు కట్టర్ సాయంతో శ్రమించి డెడ్‌బాడీలను బయటకు తీశారు. మృతులను నిజామాబాద్ జిల్లా కోటగల్లిలోని పద్మానగర్‌కు చెందిన తల్లీకూతుళ్లు.. లావణ్య, రోష్నీగా గుర్తించారు. అలాగే నవిపేటకు చెందిన ప్రశాంత్ , సునీల్‌గా మరో ఇద్దరిని గుర్తించారు. జనార్థన్ అనే వ్యక్తిని ఎయిర్‌పోర్టులో దించి తిరిగి నిజామాబాద్‌కు వెళ్తుండగా..వారిని మృత్యు కబళించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com