ఉల్లిధర @ డబుల్ సెంచరీ.. నాటౌట్..

అయ్యింది. అనుకున్నదంతా అయ్యింది. రాకెట్ లా దూసుకుపోతున్నత ఉల్లిధర చివరికి డబుల్ సెంచరీ కొట్టింది. అయితే..ఉల్లి రేట్లు కొండెక్కి కూర్చున్న కూర్చోవటంతో బంగారం కంటే ఉల్లికి ఎక్కువ విలువ ఇస్తున్నారు. చివరికి దొంగలు కూడా బంగారం, నగలు వదిలేసి కేవలం ఉల్లిగడ్డనే లక్ష్యంగా దోపిడి చేస్తున్నారు. చండీగఢ్‌లోని మొహాలీలో విచిత్ర చోరీ ఘటన చోటుచేసుకుంది. ఫేజ్-7లోని ఒక చికెన్ షాపులో చొరబడిన దొంగ అన్ని వస్తువులను వదిలేసి 40 కిలోల ఉల్లిని ఎత్తుకెళ్లాడు. ఇక రిచా గ్రామంలో ఐదు రోజుల క్రితం ఏకంగా ఆరు క్వింటాళ్ల ఉల్లిపంటనే ఎత్తుకెళ్లారు దొంగలు. దీంతో ఉల్లిపంటకు రాత్రింబవళ్లు కాపాల కాసి పంటను కాపాడుకుంటుననారు రైతులు.
ఇక సబ్సిడీ క్యూలైన్లు, రైతుబజార్ల దగ్గర చేతాడంత క్యూ లైన్లు కొనసాగుతూనే ఉన్నాయి. కొనే వాళ్లకు కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి..నెటిజన్లకు మాత్రం నవ్వులు పండిస్తోంది. ప్రస్తుతం ఈ హిలేరియస్ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని చూసి కడుపుబ్బా నవ్వుకుంటున్నారు జనాలు.
ఓ అబ్బాయి అమ్మాయికి..రింగ్‌కు బదులు ఉల్లిపాయతో ప్రపోజ్ చేస్తున్నఫొటో..ఇండియన్ ఆనియన్ అమెరికన్ డాలర్ కంటే స్ట్రాంగ్ అంటూ ఓ పోస్ట్..అలాగే ఉల్లిపాయల దగ్గర ఓ పెద్ద తుపాకీ పట్టుకొని కాపాలాగా నిల్చున్న ఓ వ్యక్తి..తమలపాకుతో పాటు ఏదైనా పండును వాయనంగా ఇచ్చే మహిళలు..ఇప్పుడు పండుకు బదులు ఆనియన్ పెడుతున్నట్లు..ఇలా రకరకాల ఫొటోలు నెట్టింట్లో ట్రెండవుతున్నాయి.
పెరిగిన రేట్లతో ఉల్లి బంగారమైంది. దీంతో సోషల్ మీడియాలో ఉల్లిగడ్డ కరెన్సీ జోకులు పేలుతున్నాయి. ఆటో ఎక్కిన ప్రయాణికుడు డబ్బులకు బదులు ఉల్లిపాయలిస్తున్న వీడియో..ఓ యువతి ఆనియన్స్ బ్యాగ్ పట్టుకొని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే..ముగ్గురు కుర్రాళ్లు ఆమెవెంటబడి..భయంతో ఆమె కిందపడిపోగానే ఆ ఉల్లిపాయలను ఏరుకొని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై పారిపోతాడు.
ఇలా రకరకాల వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పైపైకి ఎగబాకుతున్న ధరలను చూసి ఆందోళన చెందడం మానేసి..ఈ ఉల్లి జోకులను చూసి నవ్వుకోమంటున్నారు నెటిజన్లు.
డైమండ్ రింగ్ కు బదులు అనియన్ రింగ్, ఉల్లిరాశి దగ్గర సెక్యూరిటీ, పెళ్లి కానుకగా ఓ జంటకు ఉల్లిగడ్డలను బహుకరించి నవ్వులు పూయించింది అతని మిత్ర బృందం. ఇక తాంబూలంలో ఉల్లిపాయ పెట్టి పంచుకోవటం, తరహా సెటైర్లు వైరల్ అవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com