బంజారాహిల్స్‌లో కోటి రూపాయల దోపిడి.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు

బంజారాహిల్స్‌లో కోటి రూపాయల దోపిడి.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు

theft

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో కోటి రూపాయల దోపిడీ జరిగింది. ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు.. బంగారు ఆభరణాలు దోచుకున్నారు. రోడ్‌నెంబర్‌ 12లో ఉంటున్న వ్యాపారవేత్త కపిల్‌ గుప్త కుటుంబం ఆదివారం సాయంత్రం ఫంక్షన్‌కు వెళ్లింది. తిరిగొచ్చే సరికి.. ఇంట్లోని సామాన్లన్నీ చిందర వందరగా పడి ఉన్నాయి. కోటి రూపాయలు విలువైన ఆభరణాలు, నగదు చోరీ అయినట్టు గుర్తించారు. బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తిపై కపిల్‌ గుప్త కుటుంబం అనుమానం వ్యక్తం చేస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా విచారణ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story