ప్రజా క్షేత్రంలోకి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై

ప్రజా క్షేత్రంలోకి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై

tamilisai

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు.. ఈరోజు నుంచి మూడు రోజులపాటు పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజా క్షేత్రంలోకి రావడం ఇదే మొదటి సారి. మొదట యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్న గవర్నర్‌.. ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలిస్తారు. అక్కడ్నుంచి వరంగల్‌ వెళ్తారు.. కాకతీయుల కోటను సందర్శిస్తారు. చారిత్రక కట్టడాలను పరిశీలిస్తారు.. అనంతరం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లైట్స్‌ షోను తిలకిస్తారు. ఆ తర్వాత సుబేదారిలోని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సెంటర్‌లో జరిగే సమావేశంలో పాల్గొంటారు. రాత్రి వరంల్‌లోనే బస చేస్తారు..

రేపు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు వెళ్లనున్న గవర్నర్‌ తమిళిసై కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలిస్తారు.. లక్ష్మీ బ్యారేజ్‌, పంప్‌ హౌస్‌తోపాటు సరస్వతి బ్యారేజ్‌లను సందర్శిస్తారు.. మూడోరోజు రామగుండంలోని ఎన్టీపీసీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినుల కళరియపట్టు మర్మ కళ ప్రద్శన తిలకిస్తారు. ఆ తర్వాత పెద్దపల్లిలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సబల శానిటరీ నాప్కిన్‌ కేంద్రాన్ని పరిశీలిస్తారు. కాసులపల్లిలో పంచసూత్రాల అమలు తీరు, గ్రామంలో స్వచ్ఛతా కార్యక్రమాల అమలును పరిశీలిస్తారు. చివరిగా ధర్మారం మండలం నందిమేడారంలోని నంది పంప్‌హౌస్‌ వద్దకు చేరుకుని పనులు పరిశీలిస్తారు. ఆ తర్వాత హైదరాబాద్‌ తిరుగు పయనం అవుతారు.

Tags

Read MoreRead Less
Next Story