చంద్రబాబు, బుగ్గన మధ్య మాటల తూటాలు

చంద్రబాబు, బుగ్గన మధ్య మాటల తూటాలు
X

chandrababu-vs-buggana

హెరిటేజ్‌తో తనకు సంబంధం ఉందని అసెంబ్లీ వేదికగా వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తుండడంపై టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. హెరిటేజ్ తమదేనని రుజువు చేస్తే... తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాననంటూ సవాల్‌ చేశారు చంద్రబాబు. అలా రుజువు చేయలేకపోతే జగన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా ? అని ప్రశ్నించారు.

ఇటు ఏపీ రాజధానిపైనా మంత్రి బొత్స తొలిసారి అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చారు. అమరావతిపై స్పష్టత ఇవ్వాలని టీడీపీ డిమాండ్‌పై స్పందించిన ఆయన.. త్వరలోనే రైతుల ప్లాట్లను అభివృద్ధి చేస్తామన్నారు. రాజధానిని అభివృద్ధి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు.

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అంశం కూడా సభను కుదిపేసింది. తాను టీడీపీలో ఉండలేకపోతున్నానని, తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని చేసిన విజ్ఞప్తికి స్పీకర్‌ అంగీకరించడాన్ని టీడీపీ తప్పు పట్టింది. దీనిపై ఘాటుగా స్పందించిన వంశీ.. తనకు మాట్లాడే హక్కు ఎందుకు లేదని ప్రశ్నించారు.

రాజకీయ అంశాలే కాదు.. ప్రభుత్వ పథకాలపైనా అసెంబ్లీలో మాటల తూటాలు పేలాయి.. సన్నబియ్యంపై అధికార, విపక్షాల మధ్య రగడ జరిగింది. పేదలకు సన్నబియ్యం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్న టీడీపీపై ఎదురుదాడి చేశారు మంత్రులు. తాము సన్నిబియ్యం ఇస్తామని చెప్పలేదని, నాణ్యమైన బియ్యం ఇస్తున్నట్లు చెప్పామన్నారు.

రైతు భరోసాపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆర్థికమంత్రి బుగ్గన మధ్యమాటల తూటాలు పేలాయి. మాట తప్పం.. మడం తిప్పమని చెప్పే సీఎం జగన్‌ రైతులను మోసం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. మాట నిలబెట్టుకోవడం ఒక్కటే వైసీపీ తెలుసు మంత్రి బుగ్గన అన్నారు. దీనిపై స్పందించిన చంద్రబాబు రైతులు ఎవరూ వైసీపీని నమ్మడం లేదని ఆరోపించారు. వెంటనే జగన్‌ లేచి చంద్రబాబు ధోరణి చూస్తుంటే ఆయనకు సభలోనే నమస్కారం పెట్టాలని ఉందన్నారు సీఎం జగన్‌..

పంటకు గిట్టబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల బాధలు మీకు పట్టవా అని ప్రశ్నించారు. దీనిపై సీఎం ఘాటుగా స్పందించారు. చంద్రబాబులా మోసం చేసే ప్రభుత్వం తమది కాదన్నారు. పంటలకు ముందే గిట్టుబాటు ధర ప్రకటిస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ వెల్లడించారు.

అధికార-విపక్షాల మధ్య మాటల తూటాల మధ్యే.. సభలో మూడు కీలక బిల్లులు ప్రవేశపెట్టింది ప్రభుత్వం. పాఠశాల విద్య నియంత్రణ కమిషన్‌ చట్టంలో సవరణలు చేసిన బిల్లు, టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్యను పెంచుతూ.. హిందూ ధార్మిక చట్టంలో సవరణల బిల్లు, మద్యం రేట్లు పెంచేందుకు ఎక్సైజ్‌ చట్టంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెట్టింది.

Tags

Next Story