ఆర్టీసీ బస్సుల్లో బుధవారం నుంచి ఛార్జీల మోత


ఏపీలోని ఆర్టీసీ బస్సుల్లో బుధవారం నుంచి ఛార్జీల మోత మోగనుంది. వెన్నెల స్లీపర్ సర్వీసులు మినహా అన్ని బస్సుల్లోనూ ఛార్జీలను పెంచారు...సవరించిన టికెట్ రేట్లతో ఏపీఎస్ ఆర్టీసీ ప్రకటన విడుదల చేసింది. పల్లెవెలుగు బస్సుల్లో కిలోమీటర్‌కు 10 పైసలు, ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో కిలోమీటర్‌కు 20 పైసలు పెంచారు.. వీటితోపాటు ఇంద్ర ఏసీ, గరుడ, అమరావతి బస్సుల్లో కిలోమీటర్‌కు 10 పైసలు చార్జీ పెంపు ఉంటుందని ఆర్టీసీ వెల్లడించింది..
సిటీఆర్డినరీ బస్సుల్లో 11 స్టేజీల వరకు చార్జీల పెంపుదల లేదని ఆర్టీసీ తెలిపింది. పల్లెవెలుగులో మొదటి 2 స్టేజీలు.. అనగా 10 కిలోమీటర్ల వరకు చార్జీల పెంపు ఉండదు. తదుపరి 75 కిలోమీటర్ల వరకు 5 రూపాయలు పెంచారు..డీజిల్ ధరలు గత నాలుగేళ్లలో 49 నుంచి 70కి పెరిగాయని ఆర్టీసీ వెల్లడించింది. ఇంధన ధరల పెరుగుదల వల్ల సంస్థపై ఏటా 630 కోట్ల అదనపు భారం పడుతోందని తెలిపింది. విడిభాగాలు, సిబ్బంది జీతభత్యాల వల్ల ఏటా మరో 650 కోట్లు ఖర్చవుతున్నాయి..ఈ నష్టాలను భర్తీ చేసేందుకే టికెట్ రేట్లు పెంచామని ఆర్టీసీ తెలిపింది.
ఏపీలో చివరగా 2015 అక్టోబర్‌లో బస్సు ఛార్జీలు పెంచారు. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ మోత మోగించారు. నష్టాల్లో కూరుకుపోతున్న సంస్థను కాపాడుకునేందుకే ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని ఎండీ కృష్ణబాబు తెలిపారు. వీలైనంత వరకు ప్రజలపై ఎక్కువ భారం పడకుండా చూశామని చెప్పారు.. ప్రయాణికులు అర్థం చేసుకొని..ఎప్పటిలాగే ఆర్టీసీని ఆదరించాలని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

