ఉల్లి ధరలపై చంద్రబాబు నిరసన

ఉల్లి ధరలపై చంద్రబాబు నిరసన
X

babu

ఉల్లి ధరలుపై టీడీపీ అధినేత చంద్రబాబు నిరసన తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు నేతలతో కలిసి... పాదయాత్రగా వచ్చారు. ఉల్లిపాయ దండలను మెడలో వేసుకుని ఆందోళన చేపట్టారు నేతలు. రాష్ట్రంలో ఉల్లి ధరలు బంగారంతో పోటీపడుతున్నాయని చంద్రబాబు ఎద్దేవా చేశారు. నిత్యవసర ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

ఏపీలో ఉల్లి కష్టాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించారు. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదంటారు. కానీ జగన్‌ రెడ్డి గారు చేసే మేలు.. ఉల్లి కూడా చేయదు.. అందుకే దాని రేటు పెంచేశారు అంటూ ఎద్దేవా చేశారు.

విజయవాడ స్వరాజ్‌ మైదానంలోని రైతు బజార్‌లో ఉల్లి విక్రయ కేంద్రాలను టీడీపీ నేతలు దేవినేని ఉమ, బోడె ప్రసాద్‌, బోండా ఉమా పరిశీలించారు. క్యూలైన్లలో ప్రజలతో మాట్లాడారు. ఉల్లిపాయల కోసం మహిళలు, వృద్ధులు గంటల తరబడి నిరీక్షించాల్సి రావడంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉల్లి కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కుంటి సాకులు చెబుతోందని దేవినేని ఉమ మండిపడ్డారు. మంత్రులు బాధ్యతా రాహిత్యంగా మాట్లాడుతున్నారంటున్న ఫైరయ్యారు.

ఉల్లి కొరతపై మాజీ మంత్రి కొల్లురవీంద్ర మచిలీపట్నం రైతు బజారు వద్ద ధర్నా చేశారు. డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. గుంటూరులోని పట్టాభిపురం రైతు బజారులో ఉల్లి కోసం దాదాపు 2 కిలోమీటర్ల మేర బారులు తీరారు. పనులన్నీ మానుకొని గంటల తరబడి నిలుచుంటే.. కేవలం ఒక కేజీ ఇస్తున్నారని జనం మండిపడుతున్నారు.

అక్కడా ఇక్కడా అని లేదు ఏపీ అంతటా ఇదే పరిస్థితి.. ప్రతి రైతు బజార్‌లోనూ చాంతాడంత క్యూలు కనిపిస్తున్నాయి. మహిళలు, పిల్లలు, వృద్ధులు క్యూ లైన్లలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Tags

Next Story