నిర్భయ కేసు నిందితులు ఉరికొయ్యకు వేలాడతారా?

నిర్భయ కేసు నిందితులు ఉరికొయ్యకు వేలాడతారా?
X

nirbhaya-victims

ఉరి తాళ్ల తయారీకి బక్సర్ జైలు ప్రసిద్ధి. 1930 నుంచి ఇక్కడ మనీలా బ్రాండ్ పేరుతో ఉరితాడు తయారు చేస్తున్నారు. మరణశిక్ష పడిన ఖైదీలకు ఉరితీయాలంటే ఇక్కడే నుంచే వెళ్లాలి. ఇది దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది. పార్లమెంట్‌పై దాడి కేసులో అఫ్జల్ గురుకు మరణశిక్ష అమలు చేసినప్పడు ఇక్కడి నుంచే ఉరితాడును తెచ్చారు. 2016-17లో పటియాలా జైలు కూడా ఆర్డర్ చేసింది. ఇక్కడ ఉరితాడును పూర్తిగా మానవప్రమేయంతోనే తయారు చేస్తారు. యంత్రాలను అతి తక్కువగా ఉపయోగిస్తారు. ఒక రోప్‌ను రూపొందించడానికి 3 రోజులు సమయం ఐదుగురు సిబ్బంది అవసరం.. ధర సుమారు 1, 725 రూపాయలు.

భాగల్ పూర్ సెంట్రల్ జైలులో 1992, 1995 సంవత్సరాల్లో ఉరిశిక్ష విధించినపుడు కూడా ఉరితాళ్లను బక్సర్ జైలు నుంచి సరఫరా చేశారు. 2004లోపశ్చిమబెంగాల్ రేపిస్ట్ ధనుంజయ్ చటర్జీ హ్యాగింగ్‌కు కూడా మనీలా బ్రాండ్‌నే వాడారు. అత్యంత నాణ్యతతో తయారు చేయడం వల్ల ఈ తాళ్లు చాలా ధ్రృడంగా ఉండాయి. అందుకే దోషులను ఉరితీసేటప్పుడు విఫలమయ్యే ప్రసక్తే ఉండదు. ఉరితాళ్లు నిందితుల ఎత్తు కంటే 1.6 రెట్లు

పొడవు ఉండేలా రూపొందిస్తారు...

మనదేశంలో ఉరి శిక్షల అమలు చాలా అరుదు. ఇటీవలి కాలంలో అఫ్జల్ గురు, కసబ్, యాకూబ్ మెమన్‌లకు మాత్రమే మరణశిక్ష అమలు చేశారు. పార్లమెంట్‌పై దాడి కేసులో అఫ్జల్‌ గురు, ముంబై మారణహోమానికి సంబంధించి అజ్మల్ కసబ్‌, ఉగ్రదాడుల కేసులో యాకూబ్ మెమన్‌ను ఉరి తీశారు. ఆ తర్వాత మరణశిక్షలు అమలు చేయలేదు. పైగా, ఉరి శిక్షలు అమలు కూడా కొన్ని జైళ్లలోనే జరిగింది. తీహార్ జైలు, బాంబే అర్థర్ రోడ్ జైలులో డెత్ పనిష్మెంట్ ఇచ్చారు. ఇతర జైళ్లల్లో ఉరిశిక్షల అమలుకు అవకాశం రాలేదు. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత నిర్భయ కేసు నిందుతులు ఉరికొయ్యకు వేలాడబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

2012 డిసెంబర్ 16న ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగింది..పారామెడికల్ స్టూడెంట్‌పై ఆరుగురు సామూహిక అత్యాచారం చేశారు. ఆ ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. ప్రజాగ్రహం వెల్లువెత్తింది. దాంతో పోలీసులు ఆ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆరుగురు నిందితులను రోజుల వ్యవధిలోనే అరెస్ట్ చేశారు. విచారణ కూడా వేగంగా జరిగింది. ఆరుగురుని కోర్టు దోషులుగా తేల్చింది. దోషుల్లో ఒకరు మైనర్ కావడంతో మూడేళ్ల జైలు శిక్షతో బయటపడ్డాడు. మరో దోషి రామ్ సింగ్ జైలులోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన నలుగురికి ఉరిశిక్ష అమలులో తీవ్రజాప్యం జరిగింది. దిశ, ఉన్నావ్ హత్యోదంతాల నేపథ్యంలో నిర్భయ వ్యవహారం మళ్లీ తీవ్ర చర్చనీయాంశమైంది.

నిర్భయ నిందితుల క్షమాబిక్ష పిటిషన్‌ను కేంద్రం తిరస్కరించడం, ఇటీవల రాష్ట్రపతి చేసిన వ్యాఖ్యలు, బక్సర్‌ జైల్లో ఉరితాళ్ల కోసం ఆర్డర్ ఇవ్వడం...ఈ పరిణామాలన్నింటినీ చూస్టుంటే...దోషుల్ని ఏ క్షణమైనా ఉరివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ కబురు వీలైనంత త్వరగా రావాలని దేశ ప్రజలంతా ఆసక్తిగా చూస్తున్నారు.

Tags

Next Story