ప్రభుత్వ మద్యం షాపుల వద్ద మందుబాబుల చిందులు

ప్రభుత్వ మద్యం షాపుల వద్ద మందుబాబుల చిందులు
X

drinkers

ప్రభుత్వ మద్యం షాపుల వద్ద మందుబాబులు చిందులేస్తున్నారు. ఏకంగా సిట్టింగ్‌ రూంలు, స్నాక్స్‌ వంటివి ఏర్పాటు చేయడంతో అక్కడే తిష్టవేసి జనాల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అంతటితో ఆగకుండా రోడ్లపై తూలుతున్నారు. ప్రకాశం జిల్లా దోర్నాలలో మందుబాబుల తీరుతో జనం అవస్థలు పడుతున్నారు. షాపు నిర్వాహకులు మందుబాబుల కోసం ఏకంగా మంచినీటి ట్యాంకర్లనే ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు. ఎక్సైజ్‌ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story