జైల్లో డేరాబాబాతో హనీప్రీత్ రహస్య మంతనాలు

జైల్లో డేరాబాబాతో హనీప్రీత్ రహస్య మంతనాలు
X

honey

జైలు నుంచి విడుదలైన హనీప్రీత్.. రోహతక్‌లోని సునేరియా జైలులో ఉన్న డేరా సచ్చాసౌదా చీఫ్ గుర్మిత్ రాంరహీంను కలిశారు. డేరాబాబాతో గంటన్నరపాటు రహస్య మంతనాలు జరిపారు. అంబాలా జైలు నుంచి విడుదలయ్యాక హనీప్రీత్.. డేరాబాబాతో కలవడం ఇదే మొదటిసారి. దీంతో ఆమె ఏం చర్చించారనేది ఆసక్తికరంగా మారింది. డేరాబాబా అరెస్టు అనంతరం అతని అనుచరులతో కలిసి హింసను ప్రేరిపించారంటూ హనీప్రీత్‌ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.

బెయిల్‌పై విడుదలయ్యాక డేరా సచ్చాసౌదా కేంద్రంగా తన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన హనీప్రీత్‌.. డేరాబాబాను కలిసేందుకు అనేకసార్లు యత్నించారు. దీనికి జైలు అధికారులు అనుమతించ లేదు. దీంతో హనీప్రీత్.. హర్యానా జైళ్ల శాఖ డైరెక్టు జనరల్ కు లేఖ రాశారు. కోర్టును సైతం ఆశ్రయిస్తామన్నారు. దీంతో ఆమెకు డేరాబాబాను కలిసేందుకు అవకాశం ఇచ్చారు పోలీసులు. ఈ సమావేశంలో.. వీరిద్దరూ ఏం చర్చించారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. డేబాబాబా ప్రస్తుతం 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

Tags

Next Story