శ్రీవారి సేవలో ఇస్రో ఛైర్మన్

శ్రీవారి సేవలో ఇస్రో ఛైర్మన్
X

isro

ఇస్రో ఛైర్మన్ శివన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. PSLV C-48 నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం శివన్‌కు అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేద పండితులు ఆశీర్వచనం పలికారు. శ్రీహరికోటలో బుధవారం జరిగేది 75వ ప్రయోగం కాగా.. PSLV సిరీస్‌లో 50వ ప్రయోగం అన్నారు ఇస్రో ఛైర్మన్. ఇదో చారిత్రక ఘట్టంగా మిగిలిపోతుందన్నారు.

అంతకు ముందు.. సూళ్లూరుపేట కాళంగీ నది తీరాన వెలసిన చెంగాలమ్మ అమ్మవారిని కూడా ఇస్రో ఛైర్మన్ శివన్‌ దర్శించుకున్నారు. రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు చేశారు.

Tags

Next Story