దందా చేసి లక్షలు నొక్కేసిన కానిస్టేబుల్..

నెల్లూరు జిల్లాలో ఓ జీఆర్పీ కానిస్టేబుల్ దందాలకు దిగుతూ అడ్డంగా బుక్కయ్యాడు. స్పెషల్ స్క్వాడ్ పేరుతో ఓ వ్యాపారిని ఆపి తనిఖీలు చేసి అతని నుంచి 67 లక్షలు తీసుకుని పరారయ్యాడు. దీనిపై బాధితుడు సుబ్బారెడ్డి ఫిర్యాదు చేయడంతో సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే అసలు విషయం వెలుగు చూసింది. మోసానికి పాల్పడ్డ కానిస్టేబుల్‌ను అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా జె.పండలూరు మండలం కల్లంవారిపాలెంకు చెందిన సుబ్బారెడ్డి వ్యాపారం నిమిత్తం డబ్బుతో వెళ్తుండగా, పథకం ప్రకారం అతన్ని టార్గెట్‌ చేసిన కానిస్టేబుల్ ఇలా మోసానికి పాల్పడ్డట్టు తేల్చారు.

Tags

Next Story