మరో రాకెట్ ప్రయోగానికి ఇస్రో శ్రీకారం

X
By - TV5 Telugu |10 Dec 2019 11:03 AM IST

ఇస్రో మరో రాకెట్ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. శ్రీహరికోటలోని షార్ మొదటి ప్రయోగ వేదిక నుంచి బుధవారం సాయంత్రం 3 గంటల 25 నిమిషాలకు పీఎస్‌ఎల్‌వీ సీ–48 ప్రయోగించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతంలో కౌంట్‌డౌన్‌కు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేశారు. ఇప్పటికే ఉపగ్రహం లాంచ్ రిహార్సల్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ ప్రయోగం ద్వారా మొత్తం 10 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నారు. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది 50వ ప్రయోగం.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

