పరిగెత్తే గుర్రాన్నిపట్టుకోబోయి.. వీడియో వైరల్..

పరిగెత్తే గుర్రాన్నిపట్టుకోబోయి.. వీడియో వైరల్..
X

సినిమాల్లో హీరోలను చూసి తానూ అలానే చేసి హీరో అయిపోదామనుకున్నాడు. చావు తప్పి కన్నులొట్ట పోయినంత పనైంది. హీరో అవడం తరవాత సంగతి ముందు మనిషిగా బతికుంటే అంతే చాలనుకున్నాడు. మహారాష్ట్ర పుణేకు చెందిన జితేంద్ర కదమ్ అనే వ్యక్తి తాను మోటర్ బైక్‌పై వస్తూ.. బండ్ గార్డెన్ బ్రిడ్జి మీద గుర్రం బండిని వదిలాడు. గుర్రాలు వేగంగా పరిగెడుతుంటే సినిమాల్లో చూపించినట్టు రన్నింగ్‌లో దాన్ని ఎక్కాలనుకున్నాడు. బైక్ మీదనుంచి గుర్రం బండి ఎక్కే సందర్భంలో పట్టు తప్పి కింద పడిపోయాడు. దీంతో అతడి పైనుంచి గుర్రం బండి వెళ్లింది. అదృష్టవశాత్తు ప్రాణాలకు ఏమీ కాలేదు. చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. ఈ దృశ్యాలను ఓ వ్యక్తి మొబైల్‌లో చిత్రీకరించి ట్విట్టర్‌లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అవుతోంది.

Next Story