అమెరికాకు దీటుగా బదులిచ్చిన భారత విదేశాంగ శాఖ

X
By - TV5 Telugu |10 Dec 2019 5:58 PM IST

భారత పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లుపై అమెరికా అసహనం వ్యక్తం చేసింది. ఈ బిల్లు పౌరుల హక్కులకు విరుద్దంగా ఉందంటూ యూఎస్ ఆఫ్ ఇంటర్ నేషన్ రిలీజియన్ ఫ్రీడమ్ తెలిపింది. ఈ బిల్లు ఆమోదంలో కీలక నేతలు అమిత్ షాతోపాటు మరికొందరిపై ఆంక్షలు విధించాలని యోచిస్తోంది. భారత దేశానికి ఉన్న ఘనమైన లౌకిక చరిత్రకు, రాజ్యాంగంలో కల్పించిన సమానత్వపు హక్కులకు ఇది వ్యతిరేకమని అభిప్రాయపడింది. అయితే దీనిపై భారత్ దీటుగా బదులిచ్చింది. ఈ బిల్లుపై ఆ సంస్థ చేసిన వ్యాఖ్యలు ధృవీకరించదగినవి కావని భారత విదేశాంగ ప్రతినిధి రవీశ్ కుమార్ స్పష్టం చేశారు. CAB, NRC లతో గానీ ఏది కూడా భారతీయుడి పౌరసత్వాన్ని తొలగించదని వెల్లడించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

