ప్లైట్‌లో తేలు.. ప్యాంట్‌లో దూరి..

ప్లైట్‌లో తేలు.. ప్యాంట్‌లో దూరి..
X

scorpio

అష్టకష్టాలు పడి ప్లైట్ ఎక్కి అట్లాంటా వెళదామనుకుంటే దొరకనే దొరికేసాను.. నన్ను పట్టుకుని ఆకాశంలో ఎగురుతున్న విమానంలో నుంచి కిందపడేశారు.. ఇంకేం బతుకుతాను.. చచ్చి ఊరుకున్నాను. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం శాన్ ఫ్రాన్సిస్కో నుంచి అట్లాంటాకు వెళుతోంది. అందులో ఎక్కిన ఓ మహిళకు కాలి దగ్గర ఏదో గుచ్చుకున్నట్లు అనిపించింది. ప్యాంట్లో ఏదైనా దూరిందేమో అని వాష్ రూమ్‌కి పరిగెట్టింది. ప్యాంట్ విప్పి దులిపితే అందులో నుంచి ఓ తేలు కింద పడింది. అంతే.. అరుచుకుంటూ బయటకు పరిగెట్టుకుంటూ వచ్చింది. ఈ విషయం విమాన సిబ్బందికి తెలియడంతో వెంటనే ఆమెకు ప్రథమ చికిత్స చేశారు. అట్లాంటాలో ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే ఆమెను హాస్పిటల్‌లో చూపించారు. ఆమెకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. తేలు కుట్టి వుంటే విషం ఎక్కేది. కాగా, విమానంలోకి తేలు ఏలా వచ్చిందని అందరూ కాసేపు కంగారు పడ్డారు. ఆమెకు ఏమీ కాకపోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

Next Story