పౌరసత్వ సవరణ బిల్లుపై అపోహలు వద్దు - అమిత్‌షా

పౌరసత్వ సవరణ బిల్లుపై అపోహలు వద్దని, ఇది చరిత్రాత్మక బిల్లు అని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. బిల్లు వెనుక ఓటు బ్యాంకు రాజకీయాల ప్రసక్తే లేదన్నారు. దేశంలో నిర్లక్ష్యానికి గురమవుతున్న శరణార్ధులకు హక్కులను కల్పించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని చెప్పారు. పౌరసత్వ సవరణ బిల్లు-2019ను మధ్యాహ్నం 12 గంటలకు రాజ్యసభలో ప్రవేశపెట్టారు అమిత్‌షా. ఎన్డీయే ఎన్నికల మేనిఫెస్టోలో భాగమే ఈ పౌరసత్వ బిల్లు అని అని స్పష్టం చేశారు.
బిల్లుతో ఇండియాలోని ముస్లింలకు కానీ, ఈశాన్య ప్రాంతాల సంస్కృతికి కానీ ఎలాంటి ముప్పు ఉండదని అన్నారు అమిత్‌షా. ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతంగానే బిల్లు తెచ్చామని చెప్పారు. విపక్షాలు లేనిపోని భయాందోళను సృష్టిస్తున్నాయంటూ తప్పుపట్టారు. అబద్ధాలను ప్రచారం చేస్తూ..ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ వైఖరి మానుకోవాలని హితవు పలికారు. విపక్షాలు వాకౌట్ చేయకుండా చర్చలో పాల్గొనాలని కోరారు.
పౌరసత్వ బిల్లు ముస్లింలకు వ్యతిరేకమంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని, ఇందులో ఎంతమాత్రం నిజం లేదని అన్నారు అమిత్‌షా . ఈ బిల్లుకూ, ఇండియాలో ముస్లింలకు సంబంధం ఏమిటని విపక్షాలను ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com