ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు.. శిక్షణా కాలంలో స్టైఫండ్ రూ.48,160

ఈసీఐఎల్.. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్ బ్రాంచ్‌లో ఉద్యోగాల భర్తీ చేపట్టింది. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీలను నియమిస్తోంది. మొత్తం 64 ఖాళీలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, కప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వంటి విభాగాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జనవరి 4 చివరి తేదీ. గేట్ 2018, గేట్ 2019 స్కోర్ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఈసీఐఎల్. గేట్ స్కోర్ ద్వారా దరఖాస్తుల్ని షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిపికేషన్ తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
మొత్తం ఖాళీలు: 64.. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 30.. మెకానికల్ ఇంజనీరింగ్ 24.. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 10.. దరఖాస్తు ప్రారంభం: 2019 డిసెంబర్ 6.. దరఖాస్తుకు చివరి తేదీ: 2020 జనవరి 4.. విద్యార్హత: సంబంధిత విభాగంలో 65% మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రా ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు 55% మార్కులతో సెకండ్ క్లాస్‌లో పాస్ కావాలి. గేట్ 2018, గేట్ 2019 స్కోర్ కార్డ్ ఉండాలి. స్టైఫండ్: ఏడాది శిక్షణ కాలంలో రూ.48,160. శిక్షణ తర్వాత మొదటి ఏడాది రూ.67,920. రెండో ఏడాది రూ.69,960. మూడో ఏడాది రూ.72,060.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com