ఇంటెన్సివ్ క్లీనింగ్ పేరుతో జీహెచ్ఎంసి ప్రత్యేక డ్రైవ్

ఇంటెన్సివ్ క్లీనింగ్ పేరుతో జీహెచ్ఎంసి ప్రత్యేక డ్రైవ్
X

ghmc

పరిశుభ్రమైన ,పచ్చదనం తో కూడిన నగరాన్ని నిర్మిచాలనే లక్ష్యం తో ఇంటెన్సివ్ క్లీనింగ్ పేరుతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది GHMC.. మహిళా సంఘాలు, శానిటేషన్, ఎంట‌మాల‌జి విభాగాలు పాల్గొనే ఈ డ్రైవ్‌ నగర వ్యాప్తంగా నాలుగు రోజులపాటు జరగనుంది. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్‌లలో తరుచు ఏర్పడే సమస్యలు, రోడ్లపైన పేరుకుపోయిన చెత్త, కాలనీల్లో కుక్కల సంచారంతో ఇబ్బందులలాంటి అంశాలపై అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు

నివాస సముదాయాలు, షాపులు, వ్యాపార సంస్థలతో పాటు పరిసరాలను కూడా ప‌రిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు మేయర్ బొంతు రామ్మోహన్ విజ్ఞప్తి చేశారు.. కోటికి పైగా జనాభా ఉన్న నగరంలో 20 వేలమంది పారిశుధ్య కార్మికులు, సిబ్బంది మాత్రమే వున్నారని, స్వచ్ఛ హైదరాబాద్ గా తీర్చిదిద్దుటలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

కాలనీల్లో కుక్కల బెడద చాలా ఎక్కువగా ఉందని..దీనిపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన ఎలాంటి లాభం ఉండటం లేదని ఎల్.బి.నగర్ ఎం.ఎల్.ఏ సుదీర్ రెడ్డి అన్నారు.LB నగర్ తో పాటు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తం గా ప్రజలు కుక్కలతో ఇబ్బంది పడుతున్నారని..ఈ సమస్య ను డ్రైవ్ లో పరిష్కరించాలని కోరారు సుధీర్ రెడ్డి. తూతూ మంత్రంగా కాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో ఈ డ్రైవ్‌ను కొనసాగించాలని నగరవాసులు కోరుతున్నారు.

Tags

Next Story