15 ఏళ్ల కిందట తప్పిపోయి మళ్లీ తల్లిదండ్రులను చేరుకున్న భవానీ

15 ఏళ్ల కిందట తప్పిపోయి మళ్లీ తల్లిదండ్రులను చేరుకున్న భవానీ
X

bhavani

అమ్మా అంటూ ఒడి చేరే చిన్నారి ఇప్పుడు తన అంతదై తిరిగొచ్చింది. ఇక అమ్మను వదిలి వెళ్లను అంటోంది. ఇకనుంచి తోబట్టుకువులకు దూరంగా ఉండలేనని అంటోంది భవాని. ఎన్నడో 15 ఏళ్ల కింద తప్పిపోయి మళ్లీ కన్నతల్లిదండ్రులను చేరుకున్న భవానీ కుటుంబం భావోద్వేగం ఇది. శ్రీకాకుళం చీపురు పల్లిలో భవానీ అదృశ్యమైంది. ఇన్నాళ్లు విజయవాడలో ఉంది. పటమటలంకకు చెందిన మోహన్ వంశీ కృషితో… భవానీ ఆమె కుటుంబసభ్యుల చెంతకు చేరింది.

అయితే..భవానీ చేరదీసిన తల్లిదండ్రులు పెంచిన బంధాన్ని వదులుకోలేకపోయారు. మాది పేగు బంధం అంటూ కన్నతల్లి కూడా కూతురు కోసం ఆరాటపడింది. చివరికి భవానీకే నిర్ణయాన్ని వదిలేశారు. ఎక్కడున్న భవానీ బాగుండాలని కోరుకున్నారు.

పెంచిన తల్లిదండ్రులపై మమకారం ఉన్నా..ఇన్నాళ్లు దూరమైన కన్నతల్లిదండ్రుల దగ్గరే ఉంటానని చెప్పటంతో భవానీ కథ సుఖాంతమైంది. ఇక నుంచి కన్నతల్లిదండ్రులతో ఉంటూనే పెంచిన అమ్మనాన్నల దగ్గరికి తరచుగా వెళ్లి వస్తానని చెబుతోంది భవానీ.

అచ్చంగా భవానీ కథలాంటిదే ఆదిలక్ష్మీ కథ. 13 ఏళ్ల క్రితం తల్లిదండ్రులు మందలించారని ఇంట్లో నుంచి అలిగి వెళ్లిపోయింది. ఆదిలక్ష్మిని చేరదీసిన ఒక మహిళ.. తరువాత తమిళనాడులో మరో మహిళకు విక్రయించింది. అప్పటి నుంచి తమిళనాడులోని తిరువనంతపురంలో పెరుగుతూ తన పేరును లతగా మార్చుకుంది.

అప్పటి నుంచి తమిళనాడులోని తిరువనంతపురంలో పెరుగుతూ తన పేరును లతగా మార్చుకుంది. ఇటీవల ఆమెను పెంచిన మహిళ చనిపోవడంతో తల్లిదండ్రులను చూడాలని ఆదిలక్ష్మి ఆరాటపడింది. తనకు గుర్తున్న వివరాలను చెప్పిన లత భర్త సహకారంతో బెజవాడ పోలీసులను ఆశ్రియించింది. మీడియా ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సీపీ కార్యాలయానికి వచ్చి కూతురుని చూసి కన్నీటి పర్యంతమయ్యారు.

అయితే..ఇక్కడ ట్విస్ట్ ఏటంటే. లతకు తెలుగు సరిగ్గా రాదు. ఆమె తల్లిదండ్రులకు తమిళం రాదు. అయినా..కన్నీళ్లే వాళ్ల అప్యాయతను చాటుతూ మాటల అవసరం లేకుండా పోయంది.

Tags

Next Story