బంగారం రేటు బాగా తగ్గింది.. 10 గ్రాములకు..

బంగారం రేటు బాగా తగ్గింది.. 10 గ్రాములకు..
X

gold

గత మూడు నెలలుగా బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. ఇప్పుడు 0.03% నుండి రూ.37,570 ప్రతి 10 గ్రాముల బంగారం పైన ధర తగ్గిపోయింది. సెప్టెంబర్‌లో అయితే 10 గ్రాముల బంగారం 40 వేల రూపాయల ధర పలుకుతూ అత్యధికంగా ఉండగా ఈ రోజు మాత్రం ఆ ధర కాస్తా రూ.2,450లకి తగ్గిపోయింది. అదే విధంగా వెండి రేటు కూడా 0.05% నుండి కిలోకి 43,465 రూపాయలకు తగ్గిపోయింది. గ్లోబల్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా పడిపోవడంతో ఇన్వెస్టర్లు తలలు పట్టుకుంటున్నారు. 1,460 డాలర్లు ప్రతి ఔన్సుకు పడిపోవడంతో ఈనెల 15వ తేదీన వచ్చే రౌండ్‌కి డెడ్ లైన్ కావడం వల్ల అమెరికా టారిఫ్ మరియు చినా దిగుమతులపై భారీగా ప్రభావం పడే అవకాశం ఉంది కాబట్టి బంగారం కొనాలని అనుకునే వారంతా త్వరపడితే మంచిది అని ఆర్ధిక నిపుణుల అభిప్రాయం. ఎందుకంటే 40వేల పై చిలుకు ఉండే 10 గ్రాముల బంగారం ధరం ఇప్పుడు 37,500లకే వస్తుంది మరి.

Next Story