భార్యతో గొడవపడి అత్తను కత్తితో పొడిచిన అల్లుడు

భార్యతో గొడవపడి అత్తను కత్తితో పొడిచిన అల్లుడు
X

knife

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పాత ఊరిలో దారుణం జరిగింది. పిల్లనిచ్చిన సొంత అత్తను.. అల్లుడు దుర్గాప్రసాద్‌ కత్తితో పొడిచి చంపిన ఘటన కలకలం రేపింది. కుటుంబ కలహాలే హత్యకు కారణమని పోలీసుల విచారణలో తేలింది. పేల లక్ష్మి కుమార్తెను దుర్గాప్రసాద్‌ 7 నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో వారం క్రితమే దుర్గాప్రసాద్‌ భార్య వరలక్ష్మి పుట్టింటికి చేరుకుంది. కాగా.. దుర్గా ప్రసాద్‌ హైదరాబాద్‌ రెయిన్‌బో ప్రింటింగ్‌ ప్రెస్‌లో ఉగ్యోగం చేస్తున్నాడు. బుధవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి తణుకు పాత ఊరిలోని అత్తారింటికి చేరుకున్న దుర్గా ప్రసాద్‌.. వచ్చీరాగానే భార్యతో గొడవపడి అత్తగారిపై కత్తితో దాడి చేశాడు. దీంతో.. తీవ్ర రక్తస్రావంతో వీధిలోకి పరిగెత్తిన అత్త లక్ష్మిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె దారిలోనే మృతి చెందింది.

Tags

Next Story