నేను చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకునే బ్యాచ్ కాదు : నారా లోకేశ్

తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న మంత్రులు, ఎమ్మెల్యేల విమర్శలకు నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. ప్రజాసమస్యలపై టీడీపీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే.. ఈ తరహా రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తాను తెలుగులో తప్పుగా మాట్లాడడం వల్ల ఏపీకి వచ్చిన నష్టం ఏంటని సూటిగా ప్రశ్నించారు. అసెంబ్లీలో చంద్రబాబును టార్గెట్ చేసేందుకు తనపై విమర్శలు చేయడం ఏంటన్నారు.
మంగళగిరిలో ఓటమిపైనా లోకేష్ మాట్లాడారు. టీడీపీకి కంచుకోట లాంటి చోట తాను పోటీ చేయలేదని.. చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకునే బ్యాచ్ తాను కాదని అన్నారు.
ఆరు నెలల పాలనలో అన్నిటి ధలు పెంచడం తప్ప.. వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు లోకేశ్. ఇసుక, సిమెంటు, లిక్కర్, నిత్యావసరాలు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారని విమర్శించారు. హెరిటేజ్‌పై ఆర్థిక మంత్రి బుగ్గన విమర్శలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com