11 Dec 2019 12:27 PM GMT

Home
 / 
అంతర్జాతీయం / మరోసారి కాల్పుల మోతతో...

మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లిన అమెరికా

మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లిన అమెరికా
X

new-jersey

అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. న్యూజెర్సీలోని జెర్సీ నగరంలో పోలీసులకు, దుండుగులకు మధ్యజరిగిన కాల్పుల్లో ఆరుగురు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. మరణించిన వారిలో ముగ్గురు అనుమానితులు, ముగ్గురు సాధారణ పౌరులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఓ దుకాణం వద్దకు ట్రక్కులో వచ్చిన దుండుగులు విచక్షణా రహితంగా కాల్పులు జరుపడంతో జనం ప్రాణాలు రక్షించుకునేందుకు దుకాణంలో దాక్కున్నారు. వెంటనే అక్కడికిచేరుకున్న పోలీసులు దుండగులపై కాల్పులు జరిపారు. ఇరువర్గాల మధ్యజరిగిన కాల్పుల్లో ముగ్గురు అగంతకులతోపాటు మరో ముగ్గురు పౌరులు మరణించారు. తుపాకి కాల్పులతో ఆప్రాంతంలో భయాన వాతావరణం నెలకొంది. ఆ ప్రాంతంలోని షాపులను,పాఠశాలను మూసివేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.

Next Story