బస్సులో వెళ్తున్నయువతికి బలవంతంగా తాళి..

బస్సులో వెళ్తున్నయువతికి బలవంతంగా తాళి..
X

Jagan

నేను ప్రేమించాను.. నీ ప్రేమతో నాకేంటి పని.. తాళి కట్టాననుకో చచ్చినట్టు నా ప్రేమను అంగీకరిస్తావు.. భార్యగా పడి ఉంటావని అనుకుని తాళిని జేబులో పెట్టుకుని మరీ బస్సెక్కాడు. అతడు చేసిన ఈ చర్యకి పోలీసులు బట్టలూడదీసి మరీ బడితె పూజ చేశారు. అరెస్ట్ చేసి కటకటాల్లో పడేశారు. తమిళనాడులోని సాండ్రోర్ కుప్పంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆంబూరు గ్రామానికి చెందిన యువతి కాలేజీకి వెళ్లేందుకు ప్రతి రోజు బస్సులో వెళ్తుంది. ఈ క్రమంలోనే ఓ యువకుడు వెంటపడి ప్రేమిస్తున్నానంటూ వేధించేవాడు. తన ప్రేమను అంగీకరించమనేవాడు.

ఆమె తనను ఏ మాత్రం పట్టించుకోవట్లేదని ఆలోచించి తాళి బొట్టు జేబులో పెట్టుకుని బస్సెక్కాడు. తన ప్రేమను వ్యతిరేకించిన యువతికి తాళి కట్టి తనదానను చేసుకోవాలనుకున్నాడు. అతడి చర్యను ఏ మాత్రం ఊహించని ఆ యువతి ఈ హఠాత్ పరిణామానికి విస్తు పోయింది. వెంటనే కేకలు వేసింది. ప్రయాణికులు బస్సుని ఆపి మరీ అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇటీవల తాను ప్రేమించిన యువతికి వివాహం నిశ్చయమైందని తెలిసి తనకు దక్కకుండా పోతోందనే బాధతో ఇలా చేసానని పోలీసులకు వివరించాడు. పోలీసులు అతడిని అరెస్టు చేసి విచారణ ప్రారంభించారు.

Next Story