జీఎస్టీ రేట్లు పెంచే ఆలోచనలో కేంద్రం?

జీఎస్టీ రేట్లు పెంచే ఆలోచనలో కేంద్రం?
X

gst

రెవెన్యూ లోటుతో కేంద్రం సతమతమవుతున్న నేపథ్యంలో జీఎస్టీ రేట్లు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. శ్లాబులను కుదించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. వచ్చే వారం జరిగే జీఎస్టీ మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జీఎస్టీ మండలి సమావేశంలో ఈ నెల 18న జరగనుంది. ఓ వైపు జీఎస్టీ వసూళ్లు తగ్గుముఖం పట్టడం, రాష్ట్రాలకు చెల్లించాల్సిన పరిహారం బకాయి పడటం వంటి పరిస్థితుల్లో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ప్రస్తుతం జీఎస్టీలో 5, 12, 18, 28 శాతం చొప్పున నాలుగు శ్లాబులున్నాయి. కొన్నింటిపై జీఎస్టీ రేటుకు తోడు.. సెస్‌ సైతం విధిస్తున్నారు.

ప్రస్తుతమున్న జీఎస్టీ రేటును 5 శాతం నుంచి 8 శాతానికి, 12 శాతంగా ఉన్న రేటును 15శాతానికి పెంచాలని భావిస్తోంది కేంద్రం. ఈ రేట్ల హేతు బద్దీకరణకు సంబందించి జీఎస్టీ మండలి సమావేశంలో ప్రజంటేషన్‌ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే పలు వస్తువులపై విధిస్తున్న సెస్‌ను కూడా పెంచనున్నట్లు సమాచారం. ప్రస్తుతమున్న నాలుగు శ్లాబులను మూడుకు కుదించే అంశాన్ని జీఎస్టీ మండలి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags

Next Story