యువతిపై వక్రబుద్ధి చూపించిన కీచకుడు.. దేహశుద్ధి చేసిన స్థానికులు

యువతిపై వక్రబుద్ధి చూపించిన కీచకుడు.. దేహశుద్ధి చేసిన స్థానికులు

కాrapమాంధుల అకృత్యాలకు అడ్డుపడడం లేదు. చట్టాలు ఎంత పకడ్బందిగా అమలు అవుతున్నా.. కీచకుల బుద్ధి మాత్రం మారడం లేదు. మహిళలపై విషం కక్కుతూనే ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ ప్రబుద్దుడు తన వక్రబుద్ది చూపించాడు. ఎదురింట్లో ఉంటున్న ఓ అమ్మాయిపై ఆఘాత్యానికి పాల్పడే యత్నం చేశాడు. అమ్మాయి కేకలు వేయడంతో చివరికి ఆ కీచకుడి బండారం బయటపడింది.

పాల్వంచశాస్త్రి రోడ్డులో ఓ మహిళ నివాసం ఉంటోంది. భర్త చనిపోవడంతో కూరగాయాలు అమ్ముతూ తన ఇద్దరు కూతుళ్లను పోషిస్తోంది. వారి ఇంటి ముందు కిరాణం షాపు పెట్టిన కామాంధుడి అనిల్‌ చూపు ఆ అమ్మాయిలపై పడింది. ఇంట్లో తల్లి లేని సమయం చూసి ఓ అమ్మాయిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు ఆ ప్రబుద్దుడు. భయంతో అమ్మాయి కేకలు వేయడంతో.. చుట్టు పక్కల వాళ్లు, తల్లి అక్కడికి చేరుకుని కామాంధుడికి దేహశుద్ధి చేశారు. ఫిర్యాదుతో పోలీసులు అక్కడికి చేరుకుని అనిల్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story