ఓ మనిషిలో ఇన్ని కోణాలా..

అక్షరమై చదివించారు.. నాటకమై వినిపించారు.. నటుడై కనిపించారు
మారుతీరావుగారు మనల్నందర్నీ వదిలేసి మబ్బుల చాటుకి వెళ్లిపోయారు..
బహుముఖ ప్రజ్ఞాశాలిగా.. పరిపూర్ణ వ్యక్తిత్వంతో పరిమళించారు..
ఓ మనిషిలో ఇన్ని కోణాలా.. బ్రహ్మ అరడజను మందిని సృష్టించే కంటే
ఓ ఆణిముత్యాన్ని సృష్టిస్తే మేలనుకున్నాడా
మంచి వాళ్లంతా వెళ్లిపోతున్నారు.. మారిన ఈ సమాజంలో ఇమడలేక..
వచ్చిన గుర్తింపుతో తృప్తిగా తనువు చాలిస్తున్నారు..
తరాల మధ్య అంతరాలు.. చిన్నా పెద్ద తారతమ్యాలు..
కత్తికన్నా కలం గొప్పదని నిరూపించారు..
చిత్రాలెన్నింటికో సంభాషణలు పలికించారు..
నటుడిగా నవరసాలు ఒలికించారు..
నటనలో జీవించారు.. ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించారు..
విలనిజాన్ని పండిస్తూ ప్రేక్షకుల విరుపులనూ విన్నారు..
మారుతీరావు నటనా వైభవాన్ని వేనోళ్లా పొగిడారు..
అవకాశాలు తగ్గినా.. నాతో పనేముంది.. నా పాత్ర అయిపోయింది అనుకున్నారు..
మారుతీ రావు లాంటి మంచి నటులు మన మధ్య లేకపోయినా..
ఆయన రాసిన అక్షరం మనందరికీ స్ఫూర్తి దాయకం..
ఎన్నో అవార్డులు.. మరెన్నో పురస్కారాలు..
ఎంత ఎత్తుకు ఎదిగినా ఎక్కడినుంచి వచ్చామన్నది మర్చిపోని మనస్తత్వం..
మహానుభావుల పరిచయం.. ఓ మంచి గ్రంధం..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com