వెంకి మామా.. నీ నటన సూపరో సూపర్.. ట్విట్టర్ రివ్యూ

వెంకి మామా.. నీ నటన సూపరో సూపర్.. ట్విట్టర్ రివ్యూ

venky-mama

మామా.. నాకు తెలుసు నన్ను గెలిపించడం కోసం నువ్వెంత కష్టపడ్డావో.. నీతో పోటీ పడి నటించాలనుకున్నాను. నీ ఆసీస్సులతో సక్సెస్ అయ్యాననే అనుకుంటున్నాను. డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకి మామకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. వెంకీ తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడని అభిమానులు ట్వీట్లు పెడుతున్నారు. కామెడీ, సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయిందని, వెంకటేష్ మరోసారి తన పెర్మార్మెన్స్‌తో మెస్మరైజ్ చేశారని చెబుతున్నారు. ఫస్టాఫ్‌ కామెడీ బాగా పండించారని, ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగున్నాయని ట్వీట్లు చేస్తున్నారు. ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా అదిరిపోయిందని అంటున్నారు.

మార్కులు మాత్రం మామ వెంకటేష్‌కే వేస్తున్నారు. మరి కథలో ఆయనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. దానికి తగ్గట్టే వెంకీ ఇరగదీశారని అంటున్నారు. నాగచైతన్య తన పాత్ర పరిధి మేరకు నటించారని ట్వీట్లు చేస్తున్నారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ఆర్మీ సీన్లలో చైతన్య యాక్టింగ్ సూపర్ అని అంటున్నారు. తమన్ అందించిన మ్యూజిక్ అద్భుతంగా ఉందని అంటున్నారు. కమర్షియల్‌గానూ వెంకిమామ సక్సెస్ అవుతుందని సినీ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

Read MoreRead Less
Next Story