అక్కినేని వారింట పెళ్లి సందడి.. సమంత బాగా బిజీ..

అక్కినేని వారింట పెళ్లి సందడి.. సమంత బాగా బిజీ..

akkineni-family

నాగార్జున కొడుకు నాగచైతన్యకు పెళ్లైపోయింది. అఖిల్ లైన్లో ఉన్నాడు.. మరి ఇప్పుడు పెళ్లి ఎవరికి.. అభిమానుల్లో ఆసక్తి.. నాగార్జున సోదరుడు వెంకట్.. ఆయన కుమారుడు ఆదిత్య త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఐశ్వర్యతో ఆదిత్య పెళ్లి నిశ్చయమైంది. నిశ్చితార్ధ వేడుకలో చెన్నైలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు అక్కినేని కుటుంబసభ్యులంతా హాజరయ్యారు. నాగార్జున, అమల, నాగసుశీల, చైతన్య, అఖిల్, సుశాంత్, సుమంత్, సుప్రియ ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. నిశ్చితార్థ వేడుకలకు సంబంధించిన ఫోటోను అఖిల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు అఖిల్. ఈ సందర్భంగా సోదరుడు ఆదిత్యకు విషెస్ అందజేశాడు. వేడుకల్లో సమంత లేకపోవడం కొంత వెలితిగా అనిపించింది. ఫోటోలో సమంత ఎక్కడ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఆమె వరుస షూటింగ్‌లతో బిజీగా ఉండడం వల్లే నిశ్చితార్ధ వేడుకలు హాజరు కాలేకపోయినట్లు తెలుస్తోంది.

Read MoreRead Less
Next Story