ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ
X

ap-high-court

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వెయ్యొద్దని ధర్మాసనం ఆదేశించింది. గుంటూరు జిల్లావాసి పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంపై 10 రోజుల్లో పూర్తి వివరాలు అందించాలంటూ గుంటూరు జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామ సచివాయలయాలకు పార్టీ రంగులు వేసిన నేపథ్యంలోనే దీన్ని తప్పుబడుతూ పిటిషన్ దాఖలైంది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లపాడు పంచాయతీకి వైసీపీ రంగులు వేయడంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. గవర్నమెంట్ ఆఫీస్‌లకు రంగులు ఎలా వేస్తారని ప్రశ్నించింది.

Tags

Next Story