గల్లంతైన విమానంలోని వారెవరూ బతికే అవకాశం లేదు : రక్షణ శాఖ మంత్రి

X

కొద్దిరోజులక్రితం గల్లంతైన చిలీ విమానంలోని వారెవరూ బతికే అవకాశంలేదని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి అల్బర్టో ఎస్సినా తెలిపారు. 17మంది సిబ్బందితో సహా 38మంది ఉన్న విమానం కనిపించకుండా పోయింది. అయితే విమానశకలాలు సముద్రంలో కనిపించాయని, శరీర అవశేషాలు తేలియాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీన్నిబట్టి విమానంలోని వారంతా చనిపోయి ఉంటారని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అయితే విమాన శకలాలను బయటకు తీసి, ప్రమాదానికి గల కారణాలను తెలుసుకొనేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. చిలీ దక్షిణ ప్రాంతంలోని పుంట ఎరినాస్ లో బయలుదేరి అంటార్కిటికా వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
