శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ 14 కేజీల బంగారం
శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు విదేశీ స్మగ్లర్ల ముఠా 14 కేజీల పసిడిని సినీ ఫక్కీలో తరలిస్తూ డీఆర్ఐ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. డీఆర్‌ఐ అధికారులు పక్కా సమాచారంతో దాడి చేసి పట్టుకున్నారు. ఈ ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో సంచలనం సృష్టించింది. ఈ గోల్డ్ విలువ సుమారు ఆరు కోట్ల వరకు ఉంటుంది.
గోల్డ్ స్మగ్లర్లు ఇద్దరూ విమానంలో వారి సీటు కింద బంగారం కడ్డీలకు నల్లటి టేపు చుట్టి దాచారు. డీఆర్ఐ అధికారులు ఫ్లైట్‌లో తనిఖీలు నిర్వహించి గోల్డ్ స్వాధీనం చేసుకున్నారు. బంగారం తీసుకువచ్చిన ఇద్దరిలో ఒకరు దక్షిణ కొరియా, మరొకరు చైనాకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. ఇద్దరిని డీఆర్‌ఐ అధికారులు అరెస్ట్ చేశారు. బంగారం అక్రమ రవాణా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com