ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం

ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం
X

fire

అగ్ని ప్రమాదాలకు దేశ రాజధాని ఢిల్లీ అడ్డగా మారింది. వరుసగా ఫైర్‌ యాక్సిడెంట్లు చోట్లు చేసుకుంటున్నాయి. ఇటీవలే జరిగిన ఘోర అగ్నిప్రమాదాన్ని మర్చిపోకముందే మరో ఘటన జరిగింది. ఉడ్‌ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. అగ్నికీలలు భారీగా ఎగిసిపడడంతో ఫ్యాక్టరీ‌ మొత్తం పూర్తిగా దగ్ధమైంది. అయితే ప్రమాద సమయంలో అందులో ఎవరైన ఉన్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ఉడ్‌ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురైయ్యారు. భయంతో పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న ఫైర్‌ ఇంజిన్‌ సిబ్బంది.. మంటలను ఆర్పేశారు. దాదాపు 20 ఫైర్‌ ఇంజిన్లు.. గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో అంతా ఊపిరీ పీల్చుకున్నారు. అగ్నిప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags

Next Story