గంగానదిలో పడవలో ప్రయాణించిన ప్రధాని మోదీ

గంగానదిలో పడవలో ప్రయాణించిన ప్రధాని మోదీ
X

modi

నమామి గంగే ప్రాజెక్టుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. గంగమ్మ ప్రక్షాళన పనులను ప్రధాని మోదీ స్వయంగా పరిశీలించారు. ఇందులో భాగంగా గంగానదిలో పడవలో ప్రయాణించారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ పర్యటన కొనసాగింది. అటల్ ఘాట్ నుంచి ప్రారంభమమైన ఈ పడవ విహారం దాదాపు 50 నిమిషాల పాటు కొనసాగింది.

గంగా టూర్‌లో భాగంగా యూపీ, ఉత్తరాఖండ్, బిహార్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. పలువురు కేంద్రమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. గంగానది ప్రక్షాళన పనులు ఎంతవరకు వచ్చాయి..? ప్రాజెక్టు పురోగతిపై ప్రధాని సమీక్షించారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ సమావేశానికి హాజరు కాలేదు. జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్, అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడంతో ఆయన కూడా ఈ సమావేశంలో పాల్గొనలేదు.

Tags

Next Story