ఉల్లి కష్టాలు.. పార్వతీపురం రైతు బజారులో ఘర్షణ

ఏపీలో ఉల్లి కొరత సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. ఉల్లి కోసం ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో తెల్లవారుజాము నుంచే సబ్సిడీ ఉల్లి కోసం రైతు బజార్లకు క్యూ కట్టారు వినియోగదారులు. ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా రైతు బజార్‌కు బారులు తీరారు.
పార్వతీపురంలో ఒక్కసారిగా రైతు బజార్ గేట్ తీయడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో కొంతమంది వృద్దులు, మహిళలు కిందపడ్డారు. ఉల్లి కోసం ఒక్కసారిగా ఎగబడడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. కొంతమంది మహిళలు రైతు బజార్‌లోనే కొట్టుకున్నారు.
గత నాలుగు రోజులుగా ఉల్లి సరఫరా జరక్కపోవడంతో.. శనివారం రైతు బజార్‌కు జనాలు పోటెత్తారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రెండు కౌంటర్లు ఏర్పాటు చేసి ఉల్లి సరఫరా చేస్తున్నారు అధికారులు. సరిపడా సరుకు అందుబాటులోకి తీసుకొచ్చి.. ధరలు తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com