సమత కేసులో ఛార్జ్‌షీటు దాఖలు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సమత హత్య కేసులో పోలీసులు శనివారం ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో విచారణకు ఆదిలాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధ కోర్టును ఫాస్ట్ ట్రాక్ కోర్టుగా ఏర్పాటు చేశారు. ఆ కోర్టు న్యాయమూర్తి ఎం.జి. ప్రియదర్శినికి ఆసిఫాబాద్ ఎస్పీ మల్లా రెడ్డి ఛార్జ్‌షీట్ అందజేశారు.
నిందితులపై 302, 376డి సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద మరికొన్ని అభియోగాలు మోపినట్టు ఎస్పీ మల్లా రెడ్డి తెలిపారు. ఈ కేసులో 44 మంది సాక్షులను విచారించామన్నారు.
ఈ కేసులో నమోదైన అభియోగ పత్రాల మేరకు కేసును విచారించనున్నట్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రమణా రెడ్డి తెలిపారు. నిందితుల తరపున న్యాయ వాదులు ముందుకు రాని పక్షంలో న్యాయ సేవా సంస్థ నుంచి న్యాయవాధిని నియమించే అవకాశం ఉందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com