అయోధ్యలో రామమందిర నిర్మాణంపై యూపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

అయోధ్యలో రామమందిర నిర్మాణంపై యూపీ సీఎం సంచలన వ్యాఖ్యలు
X

cm-yogi

అయోధ్యలో రామమందిర నిర్మాణంపై యూపీ సీఎం యోగి అదిత్యనాధ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రామాలయ నిర్మాణానికి ప్రతి ఇంటి నుంచి ఒక ఇటుక, 11 రూపాయలు దానం చేయాలని విజ్ఞప్తి చేశారు. మోదీ హయాంలోనే అయోధ్యలో భవ్యరామ మందిరం కొలువుదీరుతుందని స్పష్టం చేశారు. రామాలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లుతో ఏ వర్గానికి ఇబ్బంది ఉండదని యోగి ఆదిత్యానాధ్ స్పష్టం చేశారు. పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్‌లలో హిందువులు, సిక్కులు తదితర మైనారిటీలను తరిమిగొట్టడం, మహిళలను వంచించడం, ఆస్తులను లూటీ చేయడం జరుగుతోందన్నారు. వారు శరణార్ధులుగా భారత్ ఆశ్రయం కోరుతున్నందునపౌరసత్వం కల్పిస్తున్నామని చెప్పారు. పౌరసత్వ బిల్లును వ్యతిరేకించే విపక్షాలు, పాకిస్థాన్ పరిభాషలో మాట్లాడుతున్నాయని విమర్శించారు.

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఈ ఎలక్షన్స్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ నాయకత్వం, అయోధ్య విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాలు రామాలయ నిర్మాణాన్ని ప్రముఖంగా చెప్పుకొచ్చారు. తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ కూడా ఈ జాబితాలో చేరారు. బగోదర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన బహిరగంసభకు యోగి హాజరయ్యారు. ఈ సందర్భంగా, అయోధ్యలో రామాలయ నిర్మాణం, రామరాజ్యస్థాపన, పౌరసత్వ బిల్లులను ప్రస్తావించారు. అసెంబ్లీ ఎన్నిక ల్లో మరోసారి బీజేపీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, ఆర్జేడీలు ఉగ్రవా దం, నక్సలిజాన్ని ప్రోత్సహించాయే కానీ, పేదలు, మధ్యతరగతి ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు.

Tags

Next Story