ఉత్తరప్రదేశ్‌లో మరో ఉన్నావ్ ఘటన.. 18 ఏళ్ల యువతిపై..

ఉత్తరప్రదేశ్‌లో రోజుకో ఉన్నావ్ ఘటన వెలుగు చూస్తోంది. తాజాగా ఫతేపూర్ జిల్లా బాందా ప్రాంతంలో 18 ఏళ్ల యువతి అత్యాచారానికి గురైంది. ఆమెను రేప్ చేసి ఆ తర్వాత నిప్పంటించి దారుణంగా చంపేశాడో రాక్షసుడు. యువతి ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన 22 ఏళ్ల యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. వాస్తవానికి ఇద్దరి మధ్య ఉన్న సన్నిహిత సంబంధం ఇటీవలే బయటపడడంతో పెద్దలు పంచాయితీ పెట్టారు. పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఇంతలోనే ఈ ఘోరం జరగడం కలకలం సృష్టించింది.
శుక్రవారమే వాళ్ల మధ్య నడుస్తున్న వ్యవహారం పెద్దల వరకూ వెళ్లడంతో.. దానిపై మాట్లాడేందుకు ఇంటికి వచ్చాడు ఆ యువకుడు. తర్వాత అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశాడు. తర్వాత నిప్పు పెట్టాడు. మంటల్లో శరీరం 90 శాతం కాలిపోవడంతో బాధితురాలు కాన్పూర్ ఆస్పత్రిలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఆమె కేకలు విన్న చుట్టుపక్కల వాళ్లు సాయం చేయడానికి ప్రయత్నించినా అప్పటికే ఒళ్లంతా కాలిపోయింది. తనపై అత్యాచారం చేసి నిప్పుపెట్టాడని వెంటిలేటర్‌పై ఉన్న బాధితురాలు స్టేట్‌మెంట్ ఇవ్వడంతో.. ఈ కేసులో బలమైన సాక్ష్యం ఉన్నట్టు అయ్యింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
వారం క్రితం ఉన్నావ్ లో ఇలాంటి ఘటనే జరిగింది. రేప్ కేసులో నిందితులు బాధితురాలిపై పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు. ఇది ఇంకా కళ్లముందు కదలాడుతుండగానే ఇప్పుడు ఫతేపూర్‌లో మరో యువతి బలైపోవడం సంచలనంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com