తప్పు చేయాలంటేనే భయపడేలా దిశ చట్టాన్ని అమలు చేస్తాం : మంత్రి సురేష్

తప్పు చేయాలంటేనే భయపడేలా దిశ చట్టాన్ని అమలు చేస్తాం : మంత్రి సురేష్
X

Screenshot_1

అత్యాచారాలకు పాల్పడిన వారు ఎవరైనా.. దిశ చట్టం ప్రకారం కఠిన శిక్ష అనుభవించాల్సిందే అన్నారు.. ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్‌. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం, రాజుపాలెంలో అత్యాచారానికి గురైన యువతి తల్లిదండ్రులను ఓదార్చి.. తక్షణ సాయంగా 50 వేల రూపాయలను అందించారు. గత ప్రభుత్వం మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారి పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం వల్లనే ఇప్పటికీ దుర్మార్గులు దారుణాలకు తెగబడుతున్నారని విమర్శించారు. ఇకపై రాష్ట్రంలో ఎవరైనా తప్పు చేయాలంటేనే భయపడేలా దిశ చట్టాన్ని అమలుచేస్తామని ఆదిమూలపు సురేష్ తెలిపారు.

Tags

Next Story