కామాంధుడు లక్ష్మణరెడ్డి అరెస్ట్

మృగాళ్లు బరి తెగిస్తున్నారు. కన్నుమిన్ను కానక కామంతో ఘోరాలకు పాల్పడుతున్నారు. చిన్నపిల్లల నుంచి మొదలుకొని పండు ముసలి వరకు మహిళలపై ఆకృత్యాలకు పాల్పడుతున్నారు కీచకులు. మహిళలపై దాడులను అరికట్టాడానికి ఓ వైపు కఠిన చట్టాలు చేస్తున్నా. మరోవైపు కామాంధుల ఆగడాలకు అడ్డుపడడం లేదు. ఏపీలో దిశ యాక్ట్ తెచ్చిన మరుసటి రోజే.. గుంటూరు జిల్లాలో ఘోరం జరిగింది. గుంటూరులోని రామిరెడ్డి నగర్‌లో ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేశాడో మృగాడు. ఇంట్లో ఆడుకుంటున్న పాపపై లక్ష్మణ్ రెడ్డి అనే యువకుడు అత్యాచారం చేశాడు. బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించాడు. బాలిక ఇంట్లోనే పై పోర్షన్‌లో అతడు నివసిస్తున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారం చేశాడు. పాప అనారోగ్యంగా ఉండడంతో తల్లిదండ్రులకు అనుమానమచ్చింది. ఏం జరిగిందని ఆరా తీయడంతో ఈ దారుణం బయటపడింది. చిన్నారికి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
బాలికపై అత్యాచారం చేసిన కామాంధుడు లక్ష్మణరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు జిల్లా ఎస్పీ రామకృష్ణ. ఫాస్ట్ ట్రాక్‌లో విచారణ చేపట్టి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. సాధ్యమైనంత తొందరగా విచారణ పూర్తి చేసి నిందితుడికి శిక్ష పడేలా చేస్తామన్నారు. మహిళలు, చిన్న పిల్లల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. మహిళలు ఎలాంటి వేధింపులకు గురి ఐనా హెల్ప్ లైన్ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com