భర్తను హత్యచేసి కిరోసిన్‌ పోసి నిప్పు

భర్తను హత్యచేసి కిరోసిన్‌ పోసి నిప్పు
X

bharya copy

యాదాద్రి జిల్లాలో సంచలనం సృష్టించిన అత్తగారింట్లో అల్లుడి హత్య కేసును పోలీసులు చేధించించారు. అక్రమ సంబంధంతో భర్తను హత్య చేసి నిప్పంటించిన భార్య భాగ్యలక్ష్మీని.. ఆమెకు సహకరించిన ప్రియుడు ఐలయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్ని రోజులు పరారీలో ఉన్న నిందితులను ఎట్టకేటలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు.

యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం వెంటాపురంలో గత నెల కొల్లూరు నరేష్‌ అనే వ్యక్తి దారుణ హత్యకు గురైయ్యాడు. భర్యా, పిల్లలను చూడడానికి అత్తగారిళ్లు అయిన వెంకటాపురానికి వెళ్లిన నరేష్‌ తెల్లారే సరికి శవమై తేలాడు. అమ్మగారి ఇంటి వద్ద మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య భాగ్యలక్ష్మే,, భర్తను దారుణంగా హత్య చేసింది. ప్రియుడి ఐలయ్యతో కలిసి హత్య చేసిన కిరోసిన్‌ పోసి నిప్పటించి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్లాన్ చేసింది. కానీ చివరికి కిల్లర్ వైఫ్‌ బండారం బయటపడింది. పరారీలో ఉన్న భార్యను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు.

మోట కొండూరు మండలానికి చెందిన నరేష్‌కు,, రాజంపేట మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మీకి 17సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తులు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబ కలహాలతో 4సంవత్సరాల నుంచి విడివిడిగా ఉంటున్నారు. భాగ్యలక్ష్మీ తన పిల్లలతో అమ్మగారి ఇళ్లైన వెంకటాపురంలో ఉంటోంది. పిల్లలను చూడడానికి భర్త నరేష్‌.. అత్తగారి ఇళ్లైన వెంకటాపురానికి వచ్చాడు. అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడని.. భర్తను చంపేందుకు ప్లాన్ చేసింది భార్య. రాత్రి భర్తకు బాగా మద్యం తాపించింది. అతను అపస్మారక స్థితిలోకి వెళ్లాక.. ప్రియుడితో కలిసి మోహంపై దిండుతో అదిమి ఊరిపి ఆడకుండా చేసి హత్య చేసింది. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు కిరోసిన్‌ పోసి నిప్పటించింది. నరేష్‌ తల్లి ఫిర్యాదుతో పోలీసులు విచారణ జరిపి హత్య కేసును చేధించారు.

Tags

Next Story