జనవరి 1 నుంచి ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులే : సీఎం జగన్‌

జనవరి 1 నుంచి ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులే : సీఎం జగన్‌
X

JAGAN-CM

జనవరి 1వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులేనని ఏపీ సీఎం జగన్‌ తెలిపారు. 52వేల మంది కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లు తెలిపారు. అధికారంలో ఉన్న అయిదేళ్లపాటు చంద్రబాబు ఆర్టీసీ కార్మికులను పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

పాదయాత్రలో ఆర్టీసీ కార్మికుల కష్టాలను చూసిన సీఎం జగన్‌.... అధికారంలోకి వచ్చిన వెంటనే విలీన హామీని నెరవేర్చారని మంత్రి పేర్ని నాని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కొత్త చట్టం తెచ్చామన్నారు. 200 రోజుల్లో ఆర్టీసీని విలీనం చేసిన ఘనత జగన్‌కే దక్కిందని ప్రశంసించారు.

Tags

Next Story