రణరంగంలా మారిన జామియా మిలియా యూనివర్శిటీ

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీ రణరంగంలా మారింది. ఆదివారం ఆందోళనకారులు నాలుగు బస్సులు, వందకు పైగా ద్విచక్రవాహనాలకు నిప్పు పెట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగం చేయాల్సి వచ్చింది. ఇప్పటికి అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. యూనివర్శిటి లోపలికి ప్రవేశించిన పోలీసులు.. వంద మంది విద్యార్ధులను అదుపులో తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పోలీసుల తీరు నిరసిస్తూ ఆదివారం నుంచి ఆందోళనలు చేస్తున్నారు విద్యార్ధులు.
హింసాత్మక ఘటనల నేపథ్యంలో సోమవారం ఆగ్నేయ ఢిల్లీలోని పాఠశాలల్ని మూసివేశారు. మధుర రోడ్ సహా జేఎంఐకి వెళ్లే రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోని ఆందోళన చెందుతున్నారు నగరవాసులు. మెట్రో స్టేషన్ల మూసివేత, ఇటు ట్రాఫిక్ స్తంభించిపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అయితే ఢిల్లీలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయంటున్నారు పోలీసులు. ఆందోళనకారులను యూనివర్సిటీ నుంచి బయటకు పంపినట్టు తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ ప్రశాంతంగా ఉందంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com