ఇంటర్, డిగ్రీ అర్హతతో 'సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్'లో ఉద్యోగాలు.. జీతం రూ.39,100

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-CBSE జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 357 ఖాళీలకు గాను అర్హతలు వేర్వేరుగా ఉన్నాయి. ఇంటర్, డిగ్రీ, బీటెక్, పీజీ పాసైనవారు తమ అర్హతలకు తగ్గ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుకు ఆఖరుతేదీ డిసెంబర్ 16. ఆసక్తిగల అభ్యర్ధులు cbse.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆల్ ఇండియా కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. పోస్టును బట్టి వేతనం రూ.39,100 వరకు ఉంటుంది.
అసిస్టెంట్ సెక్రటరీ-14.. అనలిస్ట్ (ఐటీ)-14.. అసిస్టెంట్ సెక్రటరీ (ఐటీ)-7.. జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్-8.. జూనియర్ అసిస్టెంట్-204.. సీనియర్ అసిస్టెంట్-60.. స్టెనోగ్రాఫర్-25.. జూనియర్ అకౌంటెంట్-19.. అకౌంటెంట్-6.. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం-2019 నవంబర్ 15.. దరఖాస్తుకు చివరి తేదీ: 2019 డిసెంబర్ 16.. దరఖాస్తు ఫీజు: అన్‌రిజర్వ్‌డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గ్రూప్ ఏ పోస్టుకు రూ.1500, గ్రూప్ బీ పోస్టుకు రూ.800. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ మహిళలు, రెగ్యులర్ సీబీఎస్‌ఈ ఉద్యోగులకు ఫీజు లేదు. విద్యార్హత: పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ, బీటెక్, పీజీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com